: ఏపీలో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవోలు 393, 94, 95లను విడుదల చేసింది. దీని ప్రకారం స్టాంపు డ్యూటీని 4 నుంచి 5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజును 0.5 శాతం నుంచి ఒక శాతానికి పెంచింది. కుటుంబసభ్యుల మధ్య జరిగే ఒప్పందాలపై ఒక శాతం ఫీజును సవరించింది. ఇతర ఒప్పందాలపై 6 నుంచి 3 శాతానికి ఫీజును సవరించింది. రిజిస్ట్రేషన్ ఫీజులకు సంబంధించి 2013 మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన ప్రభుత్వం, తాజా ఉత్తర్వులు ఇచ్చింది. వీటన్నిటికీ జపాన్ పర్యటనకు వెళ్లకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News