: వేప్... 2014లో కొత్త పదం ఇదేనట!
నేటికాలంలో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రతి సంవత్సరం ఇంగ్లీషు భాష వేల సంఖ్యలో పదాలను తనలో ఇముడ్చుకుంటుంది. వాటి నుంచి ఓ పదాన్ని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఆ సంవత్సర పదంగా ఎంపిక చేస్తుంది. అలా 2014 సంవత్సరానికి సంబంధించి 'వేప్' అనే పదాన్ని చేర్చారు. గతేడాది 'సెల్ఫీ' అనే పదాన్ని ఎంపిక చేశారు. ఇప్పుడా 'సెల్ఫీ' అనే పదం ఎంతలా వాడుకలోకి వచ్చిందో తెలిసిందే. అన్నట్టు... వేప్ అంటే, ఈ-సిగరెట్ ను పీల్చే విధానమట.