: రూ.2 తగ్గనున్న పెట్రోల్ ధర
పెట్రోల్ ధర లీటరుకు రూ.2 వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత వారం రోజులుగా క్రూడాయిల్ ధర తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో, ఇండియాలో సైతం ధరల సవరణ జరగనుంది. భారత చమురు కంపెనీలు ఈ వారం చివరలో పెట్రోల్ ధర తగ్గింపు విషయంలో ప్రకటన చేసే అవకాశం వుంది. పెట్రోలుతో పాటు డీజిల్ ధర సైతం తగ్గనుందని సమాచారం.