: ఆ గాయాన్ని ఎన్నటికీ మరువలేము: నరేంద్ర మోదీ
సార్క్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 26/11 దాడులను గుర్తు చేశారు. నేపాల్ రాజధాని ఖాట్మండూలో జరుగుతున్న సార్క్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముంబైపై ఆనాడు జరిగిన దాడులను భారత ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఆ గాయం అంత సులువుగా మానిపోయేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ కలసి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దాడులు జరిగి నేటికి సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యాయని ఆయన అన్నారు. 2008 ముంబై దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తుచేశారు. ఇక, సార్క్ దేశాలకు మూడు నుంచి ఐదేళ్ల వీసా, అలాగే భారత్ కు వైద్య అవసరాల కోసం వచ్చేవారికి వెంటనే వీసా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.