: అట్లాంటిస్... సముద్ర గర్భంలో నిర్మితం కానున్న నగరం!


నానాటికీ పెరిగిపోతున్న భూముల ధరలకు చెక్ పెట్టేందుకు జపాన్ మౌలిక వసతుల సంస్థ ఉపాయాన్ని కనిపెట్టింది. భవనాల నిర్మాణం కోసం అసలు తనకు భూమే అవసరం లేదంటోంది ఆ దేశానికి చెందిన షిమిజూ కార్పొరేషన్. భూమి మీద కాక ఆకాశంలో కడతారా? అంటే, కాదు సముద్ర గర్భంలో కట్టేస్తామంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదేదో జోకనుకోకండి, 2030లోగా సముద్ర గర్భంలో ఏకంగా నగరాన్నే నిర్మిస్తామని కూడా ఆ సంస్థ కాస్త గట్టిగానే ప్రకటించింది. అట్లాంటిస్ పేరిట రూపొందించనున్న సముద్ర గర్భ నగరానికి 16 బిలియన్ డాలర్లను వెచ్చించేందుకు షమిజు సన్నాహాలు చేస్తోంది. 500 మీటర్ల వ్యాసంతో గోళాకారంలో నిర్మితం కానున్న ఈ నగరంలో నివాస వసతులే కాక హోటళ్లు, వ్యాపార సముదాయాలు కూడా ఏర్పాటు కానున్నాయట. ఇక అట్లాంటిస్ లోకి వెళ్లడంతో పాటు భూతలం మీదకు వచ్చేందుకు కూడా ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు షిమిజు ప్రకటించింది.

  • Loading...

More Telugu News