: రోడ్డు మార్గం ద్వారా వద్దామనుకుంటే మా అధికారులు భయపడ్దారు: మోదీ


నేపాల్ రాజధాని ఖాట్మండూకు రోడ్డు మార్గం ద్వారా వద్దామనుకుంటే, తమ అధికారులు భయపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నందునే అధికారులు భయపడాల్సి వచ్చిందని కూడా మోదీ చెప్పుకొచ్చారు. సార్క్ సదస్సు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సార్క్ దేశాల మధ్య రోడ్డు, రైలు మార్గాలు అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్పిన ఆయన ఆ సందర్భంగా నేపాల్, భారత్ ల మధ్య ఉన్న రోడ్డు మార్గం దుస్థితిని చెప్పేందుకు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సార్క్ దేశాల మధ్య మరింత సహకారం నెలకొనేందుకు తప్పనిసరిగా రోడ్డు, రైలు మార్గాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుకావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News