: 89 ఏళ్లుగా కలిసున్న భారత జంట... అత్యధిక కాలం కాపురం చేసిన భార్యాభర్తలుగా రికార్డు


ప్రపంచంలో అత్యధిక కాలం కాపురం చేసిన జంటగా యూకేలో నివసిస్తున్న భారత జంట రికార్డు సృష్టించింది. వీరిద్దరూ శతాధిక వృద్ధులే కావడం విశేషం. 89 సంవత్సరాలక్రితం, డిసెంబర్ 11, 1925న వీరి వివాహం జరిగింది. అప్పటినుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. నాలుగు తరాలను చూసిన వీరిద్దరి పుట్టిన రోజు కూడా ఒకటే. కరమ్ చంద్ (109), ఆయన భార్యకు (102) సంవత్సరాలు నిండాయి. ఇప్పటికీ కరమ్ చంద్ రోజుకు ఒక సిగరెట్, వారంలో నాలుగు సార్లు మద్యం సేవిస్తాడట. అన్నట్టు బ్రిటన్ కు దశాబ్దకాలానికి పైగా ప్రధానిగా సేవలందించిన మార్గరెట్ థాచర్ వీరు పెళ్లి చేసుకున్న సంవత్సరంలోనే జన్మించారు.

  • Loading...

More Telugu News