: సహకారం పెరిగితే... సుసంపన్నమవుతాం: సార్క్ దేశాలకు మోదీ పిలుపు


పరస్పర సహకారం పెరిగితే, సుసంపన్న దేశాలుగా సార్క్ దేశాలు అభివృద్ధి సాధించగలవని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సార్క్ శిఖరాగ్ర సదస్సు తొలి రోజు సమావేశాల్లో భాగంగా ప్రసంగించిన మోదీ, పరస్పర సహకారంతో ముందుకు సాగుదామని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. సమష్టిగా ముందుకెళితే ఏ ఒక్క అవసరానికీ ఇతర దేశాల వైపు చూసే అవసరమే రాదని ఆయన అభిప్రాయపడ్డారు. సార్క్ దేశాల మధ్య సహకారం పెరిగేందుకు రోడ్డు, రైలు మార్గాలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. సార్క్ దేశాల్లో అపార అవకాశాలున్నాయని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలంటే, పరస్పర సహకారం తప్పదన్నారు. ప్రజల ఆశయాల మేరకు పనిచేయలేకపోతున్న సార్క్ దేశాలు, పరస్పర సహకారంతో గణనీయ వృద్ధిని నమోదు చేయనున్నాయని ఆయన అభిప్రాయపడ్దారు.

  • Loading...

More Telugu News