: ఇస్లామిక్ స్టేట్ నుంచి తప్పించమని వేడుకుంటున్న భారత యువకులు
తాము పొరపాటున ఇస్లామిక్ స్టేట్ తరపున పోరాడేందుకు వెళ్లామని, తమను ఎలాగైనా ఇరాక్ నుంచి తప్పించాలని నలుగురు భారత యువకులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన నలుగురు భారత యువకులు ఐఎస్ఐస్ పట్ల ఆకర్షితులై వారిలో కలిసిపోయారు. తాము వెనక్కు రావాలని భావిస్తున్నామని, ప్రభుత్వం కల్పించుకుంటేనే అది సాధ్యమని తల్లిదండ్రులకు సమాచారం పంపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆశ్రయించిన వీరు, తమ బిడ్డలను ఎలాగైనా ఐఎస్ఐఎస్ నుంచి తప్పించాలని కోరుతున్నారు.