: అమరుల త్యాగాలపై సభలో పొగడ్తలు... పాటలు కూడా!


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు నేటి తెలంగాణ అసెంబ్లీ నివాళులర్పించింది. ఈ సందర్భంగా అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులు కూడా అమరవీరుల త్యాగాలను కీర్తిస్తూ ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిద్దామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావు పిలుపునిచ్చారు. అయితే అమరవీరుల కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆయన ఆరోపణలపై శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అమరుల త్యాగాలపై మాట్లాడిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తనదైన శైలిలో కవితలు, పాటలను వినిపించారు. అమరుల త్యాగాలను కొనియాడుతూ ఆయన పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News