: నల్లధనంపై నేడు పార్లమెంట్ లో చర్చ


నల్లధనంపై నేడు పార్లమెంట్ లో చర్చ జరగనుంది. మంగళవారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నల్లధనంపై చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. చర్చకు ప్రశ్నోత్తరాల తర్వాత అనుమతిస్తామన్న లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రతిపాదనను తిరస్కరించిన విపక్ష సభ్యులు సభలో పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది. నల్లధనంపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. స్పీకర్ అనుమతించిన మేరకు నల్లధనంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నల్లధనంపై చర్చకు స్పీకర్ అనుమతించారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వ సమ్మతి మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా బుధవారం నల్లధనంపై చర్చకు అనుమతించారు. దీంతో నల్లధనంపై ఉభయ సభల్లో నేడు వాడీవేడీ చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో విపక్షాల వాదనలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుండగా, అధికారపక్షాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News