: బీజేపీలో చేరే ప్రసక్తే లేదు: ఖుష్బు
తన సినీ గ్లామర్, వాక్చాతుర్యంతో అభిమానులను ఆకర్షించగల నటి ఖుష్బు తమిళ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తోంది. డీఎంకేలో చేరి, అనతి కాలంలోనే ఎదిగిన ఆమె ... అంతే వేగంతో పార్టీ నుంచి బయటకు కూడా వచ్చారు. ఈ క్రమంలో, ఆమె బీజేపీలో చేరుతుందన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఈ ప్రచారానికి ఖుష్బు ముగింపు పలికారు. ఎట్టి పరిస్థితుల్లో తాను బీజేపీలో చేరనని, తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని ట్వీట్ చేశారు.