: ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుంది: ప్రధాని మోదీ
ఉగ్రవాదంపై ఇకపైనా పోరు కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ఖాట్మండు చేరుకున్న మోదీ, ముంబై ఉగ్రవాద దాడికి నేటితో ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడిని ఎలా మరచిపోగలమన్న మోదీ, ఆ దాడి ఉగ్రవాదంపై పోరును కొనసాగించాల్సిందేనని గుర్తు చేస్తోందని తెలిపారు. నాటి ఉగ్రవాద దాడిలో బలైన అమాయకులకు ఈ సందర్భంగా మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ముంబైలో ఉగ్రవాద దాడిలో పలువురు విదేశీయులు సహా 166 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారు.