: దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన పాత్రికేయుడు
గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో ఓ పాత్రికేయుడు తీవ్రంగా గాయపడి చివరకు మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని గాంధీపేటలో చోటు చేసుకుంది. ఓ దినపత్రికలో పనిచేస్తున్న శంకర్ (50) అనే పాత్రికేయుడిపై నిన్న అర్ధరాత్రి సమయంలో అతని ఇంటివద్దే కొందరు దుండగులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శంకర్ ను ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గత 15 ఏళ్లుగా ఆయన పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.