: దక్షిణాసియాకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాలు: సుష్మాస్వరాజ్


దక్షిణాసియా ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఉగ్రవాదమేనని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఉగ్ర భూతాన్ని తరిమికొట్టేందుకు సార్క్ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సార్క్ దేశాల మధ్య ఆర్థిక వృద్ధి రేటు పెరిగేందుకు ఈ దేశాల మధ్య రోడ్డు, రైల్వే, విమాన సేవలను మెరుగుపరచాల్సి ఉందని ఆమె తెలిపారు. భారత్ సన్నిహిత దేశాలతో 'అందరితో కలసి, అందరి అభివద్ధి' అనే నినాదంతో ముందుకు వెళ్తోందని ఆమె చెప్పారు. దక్షిణాసియా మరింత శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలంటే ఈ ప్రాంత సంస్కృతి, వాణిజ్యం, దేశాల మధ్య అనుసంధానం కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్‌ లో రెండు రోజుల కిందట జరిగిన వాలీబాల్ మ్యాచ్ లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిని ఆమె గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News