: రెండు గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
రెండు గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అనంతరం కిడ్నాపర్లు లక్షన్నర రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ఫిర్యాదు రాగానే కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు, అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీంతో రాయదుర్గంలోని ఓ లాడ్జిలో బాలుడి ఆచూకీని కనుగొన్నారు. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.