: జీడిమెట్లలో 'సెటిల్ మెంట్ల' సాజిద్ అరెస్టు
హైదరాబాదులోని జీడిమెట్లలో సాజిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీడిమెట్ల, సురాం, షాపూర్ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లో హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి సాజిద్ సెటిల్ మెంట్లు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. సాజిద్ ఆగడాలు మితిమీరడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి, విచారణ చేస్తున్నారు.