: జూడాలు మొండి వైఖరి వీడాలి: మంత్రి కామినేని
ఏపీలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇకనైనా వారు మొండి వైఖరి వీడాలని సూచించారు. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. డిమాండ్ల సాధనకోసం నాలుగు రోజులుగా ఏపీ జూడాలు ఆందోళన నిర్వహిస్తున్నారు. నిన్న(సోమవారం) జూడాలు, ఏడీఎంఈ అధికారి మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.