: హైస్పీడ్ రైళ్ల కోసం ఫ్రెంచి కంపెనీల సాయం కోరుతున్న రైల్వే శాఖ


దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో హై స్పీడ్ ట్రైన్ సర్వీసులు, భద్రత, వినియోగదారులకు అందించే సేవలు తదితర అంశాల్లో ఫ్రాన్స్ కు చెందిన కంపెనీల సాయం తీసుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ మేరకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఫ్రెంచ్ కంపెనీలకు ఆహ్వానం పలికారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్-ఫ్రెంచ్ రైల్వేస్ సదస్సులో మాట్లాడుతూ, భారత్ లో ఉన్నతస్థాయి ప్రయాణికులు ఉన్నారని, తమ గమ్యస్థానాలకు త్వరితగతిన చేరుకునేందుకు వారు అధిక చార్జీలు చెల్లించేందుకు సిద్ధమని వివరించారు. అలాంటి వారికోసం తాము ప్రత్యేక హైస్పీడ్ ట్రైన్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామని మంత్రి తెలిపారు. బీజేపీ సర్కారు భారత రైల్వేలను ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా నిలపాలనుకుంటోందని అన్నారు.

  • Loading...

More Telugu News