: రజనీకాంత్ అభిమానులపై డాక్యుమెంటరీ


సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఆయన అభిమానులకు ఉన్న ప్రేమ, అభిమానం అంతాఇంతా కాదు. ఇప్పుడా అభిమానం ఆమస్టర్ డామ్ కు చెందిన రింకు కల్సీ అనే ఓ యువ దర్శకుడికి స్పూర్తినిచ్చింది. ఆ అభిమానమే ఓ డాక్యుమెంటరీ రూపొందించాలనే ఆలోచన కలిగించింది. ఈ క్రమంలోనే 'ఫర్ ద లవ్ ఆఫ్ ఏ మ్యాన్' టైటిల్ తో డాక్యుమెంటరీని రూపొందించాడు. రజనీ అనారోగ్యం సమయంలో అభిమానుల పడిన ఆవేదన, తమ అభిమాన నటుడి చిత్రం విడుదలకు ముందు అభిమానులు ఎంత ఉత్సాహంతో ఎదురుచూస్తారు వంటి పలు విషయాలను యువ దర్శకుడు ఈ డాక్యుమెంటరీలో చూపిస్తున్నాడు. "అభిమానుల్లో రజనీపై ఉన్న విపరీత ఆసక్తిని చూశాకే ఈ డాక్యుమెంటరీ ఆలోచన వచ్చింది. ఇందుకోసం నాలుగేళ్ల పాటు తమిళనాడులో ఆయన అభిమానులతో గడిపా. తమ అభిమాన నటుడు అనారోగ్యంపాలైన సమయంలో వారు ఎలా ఉండేవారు? ఎలా ప్రవర్తించేవారు? అన్న విషయాలను తెలుసుకున్నా" అని రింకు చెప్పాడు. కాగా, త్వరలో రజనీని కలసి తాను తీసిన డాక్యుమెంటరీని చూపిస్తానని చెబుతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తాడట.

  • Loading...

More Telugu News