: ఎక్కువ సౌండ్ తో పాటలు వింటోందని మేనకోడల్ని చంపేశాడు!
పెద్దగా సౌండ్ పెట్టుకుని పాటలు వింటోందన్న కోపంతో సొంత మేనకోడల్ని తుపాకితో కాల్చి చంపాడొకడు. ఈ ఘటన పాకిస్తాన్ లోని చక్వాల్ జిల్లా పరిధిలోని కల్లార్ కహార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన ఇంట్లో ఒంటరిగా ఉన్న రెహానా బీబీ (17) ఎక్కువ సౌండ్ తో పాటలు వింటోంది. ఆ సమయంలో ఆమె అంకుల్ మొహమ్మద్ గులిస్తాన్ వచ్చాడు. సౌండ్ తగ్గించమని కోరగా, రెహానా వినలేదు. దీంతో కోపం పట్టలేని గులిస్తాన్ ఆమె తలపైకి కాల్పులు జరిపాడు. వీరి కుటుంబాల మధ్య మరేమైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్టు కల్లార్ కహార్ పోలీసు అధికారి సాదత్ అలీ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు.