: చంద్రబాబు కన్నా నీరో చక్రవర్తి నయం: శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే నీరో చక్రవర్తే నయమని వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుది ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి డబ్బుల్లేవని చెప్పే సీఎం, విదేశాలకు జాలీ ట్రిప్పులు వేస్తున్నారని మండిపడ్డారు. గతంలో సీఎంగా వ్యవహరించినప్పుడు చేసిన పర్యటనలతో ఎన్ని పరిశ్రమలు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. విదేశీ పర్యటనలకు ఖర్చు చేసిన డబ్బుకు సమాన విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా? అని ఆయన నిలదీశారు. విదేశీ పర్యటనల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించిన ఆయన, బాబు పర్యటనలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీని విదేశాలకు బాబు తాకట్టుపెడతారేమోననే భయం ఇక్కడి ప్రజల్లో పేరుకుంటోందని ఆయన తెలిపారు.