: ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా చైర్ పర్సన్ గా సీ.కే.ప్రసాద్!


ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా (పీసీఐ) తదుపరి చైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సీ.కే.ప్రసాద్ ఎంపికైనట్టు తెలిసింది. సోమవారం నాడు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆయనను ఎంపిక చేసిందని సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు తమకు సమాచారం అందిందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పీసీఐ చైర్ పర్సన్ గా మార్కండేయ కట్జు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో ప్రసాద్ ఎంపిక జరిగిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News