: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టకండి... లోక్ సభలో లేవనెత్తిన టీఆర్ఎస్
శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై లోక్ సభలో టీఆర్ఎస్ తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎంపీ వినోద్ ఈ అంశంపై సభలో మాట్లాడుతూ, ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు ఉండగా... డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడితోనే ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వినోద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజధానిలో ఉన్న ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందని సూచించారు.