: ఒబామా భారత్ పర్యటన బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు సూచన: అమెరికా అధికారి


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే ఏడాది జనవరిలో భారత్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై దక్షిణ ఆసియా ఉప సహాయ కార్యదర్శి అతుల్ కేశప్ మాట్లాడుతూ, "ఈ పర్యటన మొత్తం దృఢమైన స్వభావం, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఇద్దరు నేతల మధ్య సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది" అని తెలిపారు. భారత్, అమెరికాలు కలసి పనిచేందుకు ఇదొక మంచి పరిణామాన్ని కూడా సూచిస్తుందని చెప్పారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఓ అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి. అంతేగాక భారత్ లో ఒబామా పర్యటించడం ఇది రెండవసారి.

  • Loading...

More Telugu News