: టీటీడీలో అన్యమత ఉద్యోగుల ఏరివేత ప్రారంభం
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల ఏరివేత ప్రారంభమైంది. తొలి విడత ఏరివేతలో భాగంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో పనిచేస్తున్న 70 మందిని టీటీడీ మాతృశాఖకు పంపింది. వీరంతా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో అత్యాధునిక ఆయుధాలు ధరించి నిత్యం పహారా కాస్తున్న వారే. అన్యమతాలకు చెందిన వారిని టీటీడీ పరిధిలో ఉద్యోగులుగా ఉంచరాదని తీసుకున్న నిర్ణయం కారణంగానే ఎస్పీఎఫ్ లోని కొందరిని పంపినట్టు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. తదుపరి దశలో మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్న వారిని కూడా తొలగిస్తామని వివరించారు.