: రండి బాబూ రండి... పెట్టుబడులు తెండి: జపాన్ ఐటీ ఫోరంతో చంద్రబాబు
జపాన్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా రెండవ రోజు ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతినిధుల ఫోరంతో సమావేశం అయ్యారు. ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడుల అవకాశాలపై వివరణ ఇస్తూ, 24 గంటలూ విద్యుత్ ఉంటుందని, పలు కొత్త పోర్టులను నిర్మిస్తున్నామని, మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వనరులు, రవాణా సౌకర్యాల గురించి ఐటీ ఫోరం ప్రతినిధులకు చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.