: రాజ్యసభలో ప్లకార్డులు చేతబట్టిన వీహెచ్
శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మంగళవారం రాజ్యసభలో నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతబట్టిన ఆయన, తక్షణమే డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరును ఉపసంహరించని పక్షంలో బుధ, గురువారాల్లో పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలమంతా కలిసి నిరసన దీక్షకు దిగనున్నట్లు ఆయన హెచ్చరించారు.