: పాకిస్తాన్ కన్నా ప్రమాదకర శత్రువు చైనానే!


సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కన్నా చైనాతోనే ఇండియాకు ప్రమాదం ఎక్కువని, ఆ దేశంతో భారత్ నీటి యుద్ధాలు చేయవలసి రావచ్చని భారత సైన్యం మాజీ చీఫ్ ఎస్.పద్మనాభన్ అభిప్రాయపడ్డారు. 2001లో భారత పార్లమెంట్ పై ఉగ్ర దాడి తరువాత సైన్యం తలపెట్టిన 'ఆపరేషన్ పరాక్రమ'కు పద్మనాభన్ సారథ్యం వహించారు. పదవీ విరమణ అనంతరం ప్రస్తుతం ఆయన సరిహద్దు దేశాలతో భారత్ సంబంధాలపై రచనలు చేస్తున్నారు. తాజాగా ఆయన 'చైనా ఇండియా వార్ - వరల్డ్స్ ఫస్ట్ వాటర్ వార్-2029' పేరిట ఓ పుస్తకం రాస్తున్నారు. ఆయన అంచనా ప్రకారం బ్రహ్మపుత్ర నది విషయంలో ఇరు దేశాల మధ్యా యుద్ధం రానుంది. చైనా ఆ నదిని తమ దేశం వైపునకు మళ్ళించుకోనున్నదని ఆయన భావిస్తున్నారు. అయితే 2029 నాటికి చైనాతో పోలిస్తే ఇండియా మరింత అభివృద్ధి చెంది ఉంటుందని పద్మనాభన్ అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News