: గొడుగులతో లోక్ సభలో తృణమూల్ వినూత్న నిరసన
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రెండోరోజు లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వినూత్న నిరసనకు దిగారు. నల్లధనంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. నల్లధనంపై చర్చకు అనుమతించాలన్న విపక్షాల డిమాండ్లను తోసిపుచ్చిన స్పీకర్, ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో ప్రశ్నోత్తరాలను అడ్డుకునే క్రమంలో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం ముందుకు దూసుకొచ్చారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా గొడుగులను బయటకు తీశారు. దీంతో స్పీకర్ ఆ పార్టీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.