: రెండేళ్లలో రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీ


స్పానిష్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. తన స్వస్థలమైన మనకర్ లో అకాడమీని నెలకొల్పనున్నాడట. ఈ నేపథ్యంలో నాదల్ మాట్లాడుతూ, "ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రాజెక్టు కోసం చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. చివరికి వాస్తవరూపం దాల్చబోతోంది. 2016లో వేసవి శిబిరంగా ప్రారంభించేందుకు ప్రణాళిక వేస్తున్నాం" అని తెలిపాడు. ఇదే అకాడమీలో వర్ధమాన టెన్నిస్ ఆటగాళ్లు తమ చదువును కొనసాగించేందుకు పాఠశాల కూడా ఏర్పాటు చేస్తారట. పద్నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న నాదల్, ఇటీవలే అపెండిసైటిస్ అపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల్లో వెన్నుపూస నొప్పికి స్టెమ్ సెల్ చికిత్స తీసుకోనున్నాడు. తిరిగి జనవరిలో టెన్నిస్ పోటీల్లో పాల్గొననున్నాడు.

  • Loading...

More Telugu News