: నేపాల్ పర్యటన సత్ఫలితాలిస్తుందని భావిస్తున్నా: ప్రధాని మోదీ
నేపాల్ లో తాను జరపనున్న పర్యటన మంచి ఫలితాలను ఇవ్వనుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్ రాజధాని ఖాట్మండూలో రేపటి నుంచి జరగనున్న సార్క్ దేశాల సదస్సుకు బయలుదేరే ముందు ఆయన మీడియాకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సార్క్ సభ్య దేశాల మధ్య రవాణా అనుసంధానం అతి త్వరలో ఏర్పాటయ్యే దిశగా సదస్సు దోహదం చేయనుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు సందర్భంగా ఆతిథ్య నేపాల్ తో పాటు ఇతర దేశాధినేతలతోనూ ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు. ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక బంధాలు బలోపేతమయ్యే అవకాశాలున్నాయని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.