: కొత్త ఏడాదిలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ రానుంది: కేటీఆర్


కొత్త ఏడాదిలో కొత్త రాష్ట్రానికి తీపి కబురు అందనుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన సందర్భంగా కేటీఆర్ ఈ మేరకు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో వెయ్యి మెగా వాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. త్వరలో ఏర్పాటు కానున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామని చెప్పిన ఆయన సదరు సోలార్ ప్లాంట్ నుంచి జనవరిలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందన్నారు. హైదరాబాద్-మహబూబ్ నగర్ జిల్లాల మధ్య పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బుధ లేదా గురువారాల్లో సభ ముందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని కేటీఆర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News