: మోదీ గాలిలోనే చంద్రబాబు గెలిచారు: జగన్


ప్రధాని నరేంద్ర మోదీ గాలిలోనే చంద్రబాబునాయుడు గెలిచారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రెండో రోజు సమీక్ష సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కడక ఎంపీగా పోటీ చేసిన సందర్భంగా తనకు వచ్చిన మెజారిటీనే టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా వచ్చిందన్నారు. ఆ అతి స్వల్ప మెజారిటీతోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే, తానే అధికారంలోకి వచ్చేవాడినని కూడా జగన్ వ్యాఖ్యానించారు. కాని తాను అబద్ధాలు చెప్పలేనని, చంద్రబాబులా ప్రజలను మోసం చేయలేనని అన్నారు.

  • Loading...

More Telugu News