: ఐపీఎల్ లో చెన్నై, రాజస్థాన్ ల కథ కంచికేనా?


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల ప్రస్థానం ముగిసినట్టేనన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్-6లో బెట్టింగ్ కు పాల్పడ్డ గురునాథ్ మెయెప్పన్ చెన్నై జట్టు అధికారేనన్న వాదన బలపడితే చెన్నై జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇదే జరిగితే రాజ్ కుంద్రా కారణంగా రాజస్థాన్ కూడా ఇదే విపత్కర పరిస్థితిని ఎదుర్కోనుంది. సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ పిటిషన్ ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రెండు జట్ల నిష్క్రమణ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ జరిపిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక నేపథ్యంలో పలు కీలక పరిణామాలు తప్పవని తెలిసినా, ఏకంగా రెండు జట్లపై వేటు పడే దిశగా అడుగులు పడుతుండటం క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఐపీఎల్ లో విజయవంతంగా రాణిస్తున్న ఈ రెండు జట్లు సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వస్తే, ఐపీఎల్ కే ఆదరణ తగ్గుతుందన్నది కాదనలేని వాస్తవం.

  • Loading...

More Telugu News