: ముగ్గులేస్తున్న మహిళలే వారి టార్గెట్!


కృష్ణా జిల్లా మచిలీపట్నం. తెల్లవారుజామున లేచిన మహిళలు ఇళ్ళ ముందు ముగ్గులేస్తూ బిజీగా వున్నారు. అలాంటి మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టణ పరిధిలోని మాచవరం, హౌసింగ్ బోర్డు కాలని, ఇంగ్లిష్ పాలెం, కలెక్టరేట్ ప్రాంతాల్లో మహిళల మెడల నుంచి బంగారు చైన్లను లాక్కుపోయారు. అరగంట వ్యవధిలో 6 చోట్ల దొంగలు తెగబడ్డారు. కేసులు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News