: అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
శాసనసభలో నేడు చర్చించాల్సిన అంశాలంటూ బీజేపీ, టీడీపీ, సీపీఎం పార్టీలు సభకు వాయిదా తీర్మానాలను అందజేశాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల ఇక్కట్లపై బీజేపీ, 2008 డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్లపై సీపీఎం, మెదక్ జిల్లాలో హెటిరో పరిశ్రమ భూసేకరణను అడ్డుకున్న ప్రజలపై లాఠీఛార్జీ జరిపిన ఘటనలో టీడీపీ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. వరంగల్ జిల్లా రాంపూర్ లో అసైన్డ్ భూముల అంశంపై కాలింగ్ అటెన్షన్ కింద చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ నోటీసు ఇచ్చింది.