: రెచ్చిపోయిన దోపిడీ దొంగలు... బాధితుల్లో మాజీ ఎంపీ సతీమణి


హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మూడు గంటల వ్యవధిలో ఐదు చోట్ల దొంగతనాలు జరిగాయి. బాధితుల్లో మాజీ ఎంపీ మంద జగన్నాథం సతీమణి కూడా ఉన్నారు. పెళ్లిపత్రికలు పంచడానికి ఆమె వెళితే, తాము పోలీసులమని చెప్పుకున్న దుండగులు నగలను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. ఆ క్రమంలో ఆమె వద్దనున్న 9 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. మరో ఘటనలో వాకింగ్ కు వెళ్ళివస్తున్న వృద్ధురాలి మెడలోని పుస్తెల తాడును తెంచుకుపోయారు. మరోచోట గుడికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని 60 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. సరూర్ నగర్, గోల్నాక, మీర్ పేట, మారేడుపల్లి ప్రాంతాలలో ఈ ఘటనలు జరిగాయి. పట్టపగలే చైన్ స్నాచర్లు దాడులకు పాల్పడుతుండటంతో మహిళలు ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News