: మల్కాజిగిరి కార్పొరేట్ పాఠశాలలో అరాచకం... బాలికలపై తోటి విద్యార్థుల వేధింపులు


హైదరాబాద్ నగర పరిధిలోని మల్కాజిగిరికి చెందిన ఓ కార్పొరేట్ పాఠశాలలో అరాచక పర్వం వెలుగు చూసింది. పాఠశాలలోని బాలికలపై తోటి విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడటమే కాక ఆ వేధింపులను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సదరు వీడియోలను తమ మిత్రులకు పంపుతూ పాఠశాల బాలురు వికృత చేష్టలకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టాయ్ లెట్లకు వెళ్లిన బాలికలను రహస్యంగా కెమెరాల్లో బంధించిన బాలురు తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. బాలుర అకృత్యాలను గమనించిన బాలికలు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదుపై పాఠశాల యాజమాన్యం స్పందించలేదు. దీంతో బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. బాలికల తల్లిదండ్రులకు కూడా పాఠశాల యాజమాన్యం స్పందించిన పాపాన పోలేదు. దీంతో బాలికల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలను ఆశ్రయించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి, బాలుర అకృత్యాలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నేడు మల్కాజిగిరి పరిధిలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి.

  • Loading...

More Telugu News