: డ్రైవర్ లేకుండా గూడ్స్ కిలోమీటర్ వెళ్లిపోయింది
డ్రైవర్ లేకుండా ఓ గూడ్స్ రైలు కిలోమీటర్ దూరం ప్రయాణించి రైల్వే సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. రాజస్థాన్ లోని దౌసా జిల్లాలోని బంక్రిస్టేషన్ ఫ్లాట్ ఫాంపై నిలిపి ఉన్న గూడ్స్ రైలు కిలోమీటర్ దూరం ప్రయాణించిందని నార్త్ వెస్ట్రన్ రైల్వే పీఆర్వో తరుణ్ జైన్ తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించామని ఆయన అన్నారు. దీనికి బాధ్యులను చేస్తూ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సహా ముగ్గురు రైల్వే సిబ్బందిని సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు.