: ప్రధాని పర్యటన నేపథ్యంలో 7 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం
ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. దీంతో ఆయన పర్యటించనున్న ప్రదేశాల పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ఎన్ఐఏ పర్యవేక్షించింది. ఈ నేపథ్యంలో అసోంలోని ఓ రైల్వే స్టేషన్ లోని శౌచాలయం వద్ద ఏడు కిలోల పేలుడు పదార్థాలు ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ పేలుడు పదార్థాలు ఎవరు పెట్టారు? అనే కోణంలో ఐఎన్ఏ దర్యాప్తు ప్రారంభించింది.