: శారదా స్కాంలో మమతా బెనర్జీనే అతిపెద్ద లబ్ధిదారు: కునాల్ ఘోష్


వందల కోట్ల శారదా గ్రూప్ చిట్ ఫండ్ స్కాంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే అతిపెద్ద లబ్ధిదారు అని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఆరోపించారు. కాబట్టి ఈ కేసు స్కాంలో ఆమెను తన సమక్షంలో సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. శారదా స్కాంలో ఇప్పటికే అరెస్టయిన కునాల్ జైల్లో రిమాండ్ లో ఉంటున్నారు. మరోవైపు చిట్ ఫండ్ స్కాంలో మమతకు ప్రమేయం ఉందని ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో ఇటీవల స్పందించిన మమతా, తన జోక్యం ఉందని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కూడా తెలిపారు. మరి తాజాగా కునాల్ చేసిన ఆరోపణలు ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో!

  • Loading...

More Telugu News