: కాళ్లు, చేతులు కట్టేసి పడి వున్న స్థితిలో వైమానిక దళాధికారి మృతి


గదిలో కాళ్లు, చేతులు కట్టేసి పడి వున్న అనుమానాస్పద స్థితిలో విశ్రాంత వైమానిక దళాధికారి మృతి చెందిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. పర్వేజ్ ఖొఖోర్ (70) తన భార్యతో కలిసి బెంగళూరులోని హోస్కురలోని ఓ రెసిడెన్షియల్ విల్లాలో నివాసం ఉంటున్నారు. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేసిన ఖొఖోర్ 35 ఏళ్లపాటు వైమానిక దళంలో సేవలందించారు. ఇంటి లోపలివైపు తలుపులు వేసుకున్న ఆయన తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. వేరేగదిలో పడుకున్న అతని భార్య, నిద్రలేచిన తరువాత భర్తను పిలిచినా పలకకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు ఇల్లు లోపలివైపు నుంచి తాళం వేసి ఉండడం గమనించి, వెనుకవైపు తలుపులు పగులగొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఆయన గదిలో వస్త్రంతో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతి చెంది కనిపించారు. దీంతో వారు పోలీసులకు సమాచారమందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News