: ఏపీలో జూడాలతో చర్చలు విఫలం... యథావిధిగా సమ్మె
ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్లతో ఏడీఎంఈ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఈ మధ్యాహ్నం ప్రభుత్వం తరపున ఏడీఎంఈ, జూనియర్ వైద్యులతో చర్చలు జరిపారు. గ్రామాల్లో ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధనను సడలించాలని జూడాలు కోరారు. ఇందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. నిబంధన సడలించకుంటే సమ్మె విరమించబోమని జూడాలు స్పష్టం చేశారు. దాంతో, రేపటి నుంచి సమ్మె యథావిధిగా జరగనుంది. అటు, జూడాల ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఏడీఎంఈ వెంకటేష్ తెలిపారు.