: తీగల, తలసాని, ధర్మారెడ్డిపై స్పీకర్ కు టి.టీడీపీ ఫిర్యాదు
పార్టీ ఫిరాయించిన తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు టి.టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెలంగాణ టీడీపీ నేతలు స్పీకర్ ను కలసి కోరారు. పార్టీ మారిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అన్హరత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఆ ముగ్గురు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.