: నటి జీవితకు బెయిల్ మంజూరు


సినీ నటి జీవితకు బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించిన విధంగా రూ.25 లక్షల జరిమానాను ఆమె డిపాజిట్ చేశారు. తనకు కోర్టు జైలు శిక్ష విధించిందంటూ చానళ్లలో పుకార్లు పుట్టించారని మీడియాతో అన్నారు. 'ఎవడైతే నాకేంటి' సినిమాకు తాను దర్శకురాలినని, శేఖర్ రెడ్డి నిర్మాత అని, అలాంటిది ఆయనకు తానెలా డబ్బులివ్వాలని ప్రశ్నించారు. కాబట్టి కోర్టు తనకు ఎలాంటి శిక్ష వేయలేదని, న్యాయస్థానంపై గౌరవంతోనే డబ్బులు డిపాజిట్ చేశానని తెలిపారు. కాగా, ఈ చెక్ బౌన్స్ కేసులో జీవితకు కోర్టు రేండేళ్ల జైలు శిక్ష, ఇరవై ఐదు లక్షల రూపాయలు జరిమానా కూడా విధించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News