: సినిమా స్టయిల్ లో దోపిడీకి యత్నం... ఒళ్లు హూనం!


డమ్మీ తుపాకీ చూపించి దోపిడీ చేయడం పలు సినిమాల్లో చూశాం. అలాగే చేసేయొచ్చనుకున్నాడేమో కానీ, ఓ ప్రబుద్ధుడు ఇలాగే ప్రయత్నించి, పట్టుబడి ఒళ్లు హూనం చేయించుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా బావిచెట్టువారిపేటలో ఓ వ్యక్తి ఓ ఇంట్లో దూరాడు. తుపాకీ చూపించి, నగలు, నగదు కావాలని బెదిరించాడు. దీంతో ఆ ఇంట్లోని మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని దగ్గర ఉన్నది డమ్మీ తుపాకీ అని నిర్ధారించిన పోలీసులు, అతనిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News