: ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేశు నివాసంలో 22 లైవ్ బుల్లెట్లు
కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనలో నిందితుడైన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేశు నివాసంలో వివిధ తుపాకులకు చెందిన 22 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2 డమ్మీ బుల్లెట్లు, 6 ఉపయోగించిన బుల్లెట్ షెల్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను రిమాండ్ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఓబులేశును ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.