: సంక్రాంతికి పౌరసరఫరాల శాఖ ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్: మంత్రి సునీత


రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీ పౌరసరఫరాల శాఖ ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్ పంపిణీ చేయబోతున్నట్టు మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ మేరకు తమ శాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. పండుగ సమయంలో ప్రతి నిరుపేద కుటుంబం మంచి భోజనం చేసేలా ప్రత్యేక వస్తువులను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన తరువాత అమలు చేస్తామని అనంతపురంలో తెలిపారు. అటు ఈ నెల 26, 27న ఛత్తీస్ గఢ్ పర్యటనకు వెళుతున్నామని, లెవీ కొలవడం నుంచి కోటా పెంపు వరకు అన్నింటిపై అధ్యయనం చేస్తామని సునీత వెల్లడించారు.

  • Loading...

More Telugu News