: 17 సెకన్లలో 25 పదాలు... ఫాస్టెస్ట్ టెక్స్టింగ్ తో గిన్నిస్ లోకి 'స్మార్ట్' బాయ్


బ్రెజిల్ కు చెందిన 17 ఏళ్ల మార్సెల్ ఫెర్నాండెజ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. స్మార్ట్ ఫోన్ పై 17 సెకన్లలో 25 పదాలను టెక్స్టింగ్ చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టాడీ యంగ్ బ్రెజిలియన్. శాంసంగ్ గెలాక్సీ ఎస్4 ఫోన్ పై మే నెలలో 18.19 సెకన్లలో 25 పదాలు టెక్స్టింగ్ చేశాడు. తాజాగా 17 సెకన్లలోనే పాతిక పదాలు టైప్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం మార్సెల్ ఐఫోన్6 ఉపయోగిస్తున్నాడు. "ద రేజర్-టూత్డ్ పిరానాస్ ఆఫ్ ద జెనరా సెర్రాసాల్మస్ అండ్ పైగోసెంట్రస్ ఆర్ ద మోస్ట్ ఫెరోషియస్ ఫ్రెష్-వాటర్ ఫిష్ ఇన్ ద వరల్డ్. ఇన్ రియాలిటీ దే సెల్డమ్ అటాక్ ఏ హ్యూమన్" అన్న ఈ సందేశాన్నే మార్సెల్ అత్యంత వేగంగా టెక్స్టింగ్ చేశాడట.

  • Loading...

More Telugu News